News September 15, 2024
ఆ కేసు విచారణలో గత బీఆర్ఎస్ సర్కార్ విఫలం: బండి

TG: ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే కేసును సీబీఐ లేదా ఈడీకి బదిలీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. రాహుల్ లేని లోటును కేటీఆర్ భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
టీమ్ ఇండియాకు షాక్.. 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 రన్స్కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 13, కేఎల్ రాహుల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జాన్సెన్, హార్మర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి మరో 527 రన్స్ కావాలి.
News November 25, 2025
BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.


