News July 25, 2024

గత ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల అప్పు చేసింది: భట్టి

image

TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,71,757కోట్ల అప్పు చేసిందని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్ర రుణం పది రెట్లు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం రూ.42,892 కోట్లు చెల్లించిందని తెలిపారు. బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Similar News

News December 9, 2025

ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

image

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

విజృంభిస్తున్న భారత బౌలర్లు

image

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ డికాక్‌ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్‌కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.