News September 12, 2025

గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

image

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.

Similar News

News September 12, 2025

Way2News ఉత్తరాదిలోనూ రాణించాలి: చంద్రబాబు

image

డిజిటల్ మీడియా రంగంలో వే2న్యూస్ జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘వే2న్యూస్ ఓ స్టార్టప్ కంపెనీ. నాలెడ్జ్ ఎకానమీలో 19 ఏళ్ల క్రితమే ఫౌండర్ రాజు వనపాల వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో వే2న్యూస్ రాణిస్తోంది. ఉత్తర భారతదేశంలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని Way2News కాన్‌క్లేవ్‌లో సీఎం అన్నారు.

News September 12, 2025

BIG ALERT: రేపు అతిభారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News September 12, 2025

వేప మందులను ఇలా వాడితే ఎక్కువ లాభం

image

పంటల్లో వేపనూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు హానిచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.