News September 22, 2024
ఈ పీతల రక్తం ధర రూ.లక్షల్లోనే.. ఎందుకంటే..

పీతల్ని తింటారని మాత్రమే మనకు తెలుసు. కానీ హార్స్షూ అనే జాతి పీతల రక్తాన్ని పరిశోధనలకు ఉపయోగిస్తారు. నీలం రంగులో ఉండే వాటి బ్లడ్ ఒక లీటర్ ధర రూ.12 లక్షలకు పైమాటే. కొన్ని ఔషధాలు, వ్యాక్సిన్లను తయారు చేసేప్పుడు రోగకారకాల్ని గుర్తించేందుకు లిములస్ అమీబోసైట్ లైసేట్(LAL)ను వాడతారు. ఆ LALని హార్స్షూ పీతల రక్తం నుంచే తయారుచేస్తారు. అందుకే దానికి అంత ధర ఉంటుంది.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.
News November 17, 2025
MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


