News September 10, 2025
ఈ కారు ధర రూ.30 లక్షలు తగ్గింది

జీఎస్టీ కొత్త శ్లాబుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోడళ్లను బట్టి ఈ కారు ప్రైజ్ రూ.4.5లక్షల నుంచి రూ.30.4లక్షలు తగ్గడం విశేషం. అయితే రేంజ్ రోవర్ బేసిక్ మోడల్ రేటు రూ.2 కోట్లకు పైమాటే. ఇక ఇదే కంపెనీకి చెందిన డిఫెండర్‌పై రూ.7-రూ.18.60 లక్షలు, డిస్కవరీపై రూ.4.5-రూ.9.90 లక్షల మేర తగ్గింపు వర్తించనుంది.
Similar News
News February 12, 2026
బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!

TG: బ్రిటిష్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జీవిత కాల సభ్యుడి(Life Peer)గా ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. భగవద్గీతపై ఆయన ప్రమాణం చేయడం గమనార్హం. సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు 25 ఏళ్ల కిందట UK వెళ్లారు. గాంధేయవాదాన్ని పెంపొందిస్తూ, AI, గ్లోబల్ గవర్నెన్స్‌పై కృషి చేస్తున్నారు. ఇలా సమాజ సేవ చేసిన వారిని Life Peerతో UKలో సత్కరిస్తారు. ఇకపై ఆయన్ను ‘లార్డ్ నాగరాజు’గా పిలుస్తారు.
News February 12, 2026
కోత అనంతరం అరటిని ఆశించే తెగుళ్లు- జాగ్రత్తలు

కోత అనంతరం నిల్వ దశలో ఉన్న అరటిలో ఆంత్రాక్నోస్ (కాయలపై మచ్చలు), హస్త మొదలు కుళ్లు, కాయ మచ్చిక కుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నివారణకు అరటి హస్తాలను కత్తిరించిన వెంటనే ఒక శాతం పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ (ఆలమే) ద్రావణంలో ముంచి ఆరిన తరువాత 150 గేజ్ (సుమారు 37.5 మైక్రాన్లు) మందం కలిగిన పాలిథిన్ సంచులలో నిల్వ చేసుకోవాలని ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు.
News February 12, 2026
HURLలో 40 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<


