News October 12, 2024

ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర

image

AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News November 25, 2025

టెంపుల్ కారిడార్ నిర్మాణానికి రూ.380 కోట్లు: TPCC ఛీఫ్

image

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్మపురిలో ప్రారంభమై కొండగట్టు, వేములవాడ, భీమ్‌గల్ మీదుగా బాసర వరకు ఈ కారిడార్ నిర్మిస్తారని ఆయన ప్రకటించారు.

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు: సీఎం హిమంత

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.