News November 19, 2024
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,070కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.700 పెరిగి రూ.70,650గా నమోదైంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరిగి రూ.1,01,000 పలుకుతోంది.
Similar News
News October 17, 2025
చిత్త కార్తె.. వ్యవసాయ సామెతలు

✍️ చిత్త కురిస్తే చింతలు కాయును
✍️ చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును
✍️ చిత్తలో చల్లితే చిత్తుగా పండును
✍️ చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
* రబీ పంటలకు చిత్త కార్తెలో పడే వానలు చాలా కీలకం. అందుకే ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవారు.
* మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
<<-se>>#AgricultureProverbs<<>>
News October 17, 2025
ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.
News October 17, 2025
పాత రిజర్వేషన్లతో ఎన్నికలు! ఖాయమేనా..?

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ఇవాళ ప్రశ్నించడంతో ప్రభుత్వం, EC అయోమయంలో పడ్డాయి. జీవో నం.9పై 2 వారాల క్రితం స్టే ఇచ్చిన కోర్టు నేడు దానిపై స్పందించకుండా డేట్ అడగడంతో ఆ జీవో రద్దయిందనే అనే ప్రశ్న తలెత్తుతోంది. అటు గవర్నమెంట్, SEC 2 వారాల సమయం అడిగాయి. దీంతో ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.