News August 12, 2024
భారీగా పెరగనున్న భూముల ధరలు?

TG: రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. పెంపు ప్రతిపాదనలపై ఈనెలాఖరులో అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ధరల పెంపును అమల్లోకి తేనున్నట్లు సమాచారం. దీనిపై ఈనెల 17లోగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ భూముల ధర 50-100%, ప్లాట్ల విలువ 15% పెరగనున్నట్లు సమాచారం. ధరల పెంపు యావరేజ్గా 30-50% ఉండొచ్చని తెలుస్తోంది.
Similar News
News October 20, 2025
‘K-Ramp’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం ఇండియాలో దాదాపు రూ.2.25 కోట్లు(నెట్) వసూలు చేసిన ఈ మూవీ ఆదివారం రూ.2.85 కోట్ల వరకు రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.5.1 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ హాలిడే నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.
News October 20, 2025
APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్సైట్:sameer.gov.in/
News October 20, 2025
దీపావళికి, గుడ్లగూబకు సంబంధమేంటి?

దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారన్న విషయం తెలిసిందే! ఆ అమ్మవారి వాహనమే గుడ్లగూబ. అందుకే నేడు ఆ పక్షిని చూస్తే శుభం కలుగుతుందని చెబుతుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పక్షిని బలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇది మూఢ నమ్మకమేనని పండితులు చెబుతున్నారు. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకొని గుడ్లగూబ వేటగాళ్లు అక్రమ వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దుష్ప్రచారాన్ని సృష్టించార’ని అంటున్నారు.