News September 6, 2025

ఈ కార్ల ధరలు తగ్గాయ్..

image

మారుతి సుజుకీ బ్రెజా కారు ధర ప్రస్తుతం రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. మొత్తం 45% పన్ను (28% GST+17% CESS) పడుతోంది. కొత్త జీఎస్టీ ప్రకారం 40% ట్యాక్స్ వేయనున్నారు. సెస్ లేకపోవడంతో రూ.30వేల వరకు ఆదా కానున్నాయి. నెక్సాన్ (పెట్రోల్) కారుపై రూ.68వేల నుంచి రూ.1.26 లక్షలు, వ్యాగన్ Rపై రూ.64వేల-రూ.84వేలు, స్విఫ్ట్‌పై రూ.71వేల-రూ.1.06 లక్షలు, i20పై రూ.83వేల-రూ.1.24 లక్షల వరకు సేవ్ కానున్నాయి.

Similar News

News September 6, 2025

బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

image

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.

News September 6, 2025

కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

image

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

News September 6, 2025

ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

image

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్‌ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.