News September 8, 2024
రేపు మోదీతో అబుదాబి యువరాజు భేటీ

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అబుదాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఖాలెద్ బిన్ రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఖాలెద్ బిన్ రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఎల్లుండి ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరమ్లో ఆయన పాల్గొంటారు.
Similar News
News December 5, 2025
తిరుమల: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.
News December 5, 2025
నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.531కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మ.2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ (రూ.200Cr), మెడికల్ కాలేజీ (రూ.130Cr), నర్సింగ్ కాలేజీ (రూ.25Cr) భవనాల నిర్మాణాలకు, WGL-నర్సంపేట 4 లేన్ల రోడ్డు (రూ.82.56Cr), నర్సంపేట పరిధిలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మ.3.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
News December 5, 2025
ఉప్పును నేరుగా చేతితో తీసుకోకూడదు.. ఎందుకు?

ఉప్పును నేరుగా చేతితో తీసుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా చేయడాన్ని రహస్యాలు పంచుకోవడంలా భావిస్తారు. ఫలితంగా గొడవలు జరుగుతాయని, చేతితో ఉప్పు తీసుకున్నవారిపై శని ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యేష్టాదేవి దోషాలను తొలగించడానికి ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఇతరుల చేతి నుంచి ఉప్పు స్వీకరిస్తే, వారిలోని చెడు ప్రభావం మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తారు.


