News March 27, 2025

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమా స్టోరీ చెప్పేసిన నిర్మాత

image

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, విశ్వక్ సేన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమా స్టోరీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్‌లా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. ప్రొడ్యూసర్ కూతురితో యంగ్ డైరెక్టర్ ప్రేమాయణం కథాంశమని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందనేది ఫన్నీగా ఉంటుందని తెలిపారు. ఈ స్టోరీ హీరోయిన్ డామినేటెడ్‌గా ఉంటుందన్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News November 8, 2025

TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

image

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in/