News April 25, 2024
మేం కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు: రేవంత్

TG: కాంగ్రెస్, BRS కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మేం కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు లేవు. నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది. అన్నారం ఆకాశాన్ని అంటింది. సుందిళ్ల సున్నం అయింది. కాళేశ్వరం వెళ్దాం రండి.. కేసీఆర్ కట్టిన అద్భుతమేంటో మేం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.
Similar News
News December 18, 2025
చలి పెరిగింది.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువుల షెడ్లలో కరెంటు బల్బులను ఏర్పాటు చేసి వెలుతురు, వేడిని అందించాలి. రాత్రివేళ పశువులను ఉంచే పాకలు, కొట్టాలు, షెడ్ల చుట్టూ గోనెసంచులతో లేదా తడికెలతో కప్పి ఉంచాలి. తడిగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను ఉంచకూడదు. పశువులకు గోరువెచ్చని నీటిని అందించాలి. వెటర్నరీ వైద్యుల సూచన మేరకు అవసరమైన టీకాలను పశువులకు అందించాలి.
News December 18, 2025
గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్

TG: పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించిన ఎన్నికల, ప్రభుత్వ సిబ్బందిని సీఎం రేవంత్ అభినందించారు. మూడు విడతలుగా 12,702 చోట్ల జరిగిన ఎన్నికల్లో 7,527 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 808 స్థానాలను పార్టీ రెబల్స్ గెలుచుకున్నారని వెల్లడించారు. మొత్తం 8,335(66%) తాము విజయం సాధించామని చెప్పారు. 3,511 స్థానాల్లో BRS, 710 బీజేపీ, 146 చోట్ల ఇతరులు గెలిచారని వెల్లడించారు.
News December 18, 2025
అపర శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్||
అపర శక్తిమంతుడు, సాటిలేని పరాక్రమవంతుడు, తేజస్సు, కాంతి గలవాడు, ఎవరూ ఊహించలేనంత అద్భుత రూపం కలవాడు విష్ణువు. లక్ష్మీదేవితో ఉండే శ్రీమంతుడైన ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన చరిత్ర గల మహాశక్తి సంపన్నుడు. ఇంతటి శక్తులు గల పరమాత్ముడిని భక్తితో దర్శించడం వలన, మనకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


