News September 3, 2025

కవిత ప్రశ్న.. సమాధానం ఎక్కడ..?

image

ఇవాళ ప్రెస్‌మీట్‌లో అనేక ఆరోపణలు, అంశాలు ప్రస్తావించిన కవిత ఓ ప్రశ్న కూడా సంధించారు. అది అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టిన BRS కార్యకర్తలు KCRపై CBI దర్యాప్తు చేయిస్తామని రేవంత్ అంటే ఎందుకు నిరసన తెలపలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ BRSకి ఎన్నో నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు సరిగా స్పందించలేదని ప్రజలూ సమాధానం కోసం చూస్తున్నారు.

Similar News

News February 5, 2026

350 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల వారు ఫిబ్రవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in

News February 5, 2026

AP EAPCET రిజిస్ట్రేషన్లు షురూ

image

జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం ఉంటుంది. మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహిస్తారు.

News February 5, 2026

వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?

image

TG: వచ్చే వారంలో వరుసగా 3రోజులు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది.