News June 18, 2024

ఒక్క రైలు ప్రమాదానికే రిజైన్ చేసిన రైల్వే మంత్రి!

image

పశ్చిమ బెంగాల్‌ రైలు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 1999లో జరిగిన గైసల్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ అటల్ బిహారి వాజ్‌పేయి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు.

Similar News

News October 7, 2024

ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC

image

దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.

News October 7, 2024

మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

image

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.

News October 7, 2024

దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!

image

పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.