News December 18, 2024
ఆగిన వర్షం.. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం!

బ్రిస్బేన్ టెస్టులో 5వ రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడగా అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే ఇండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్కు రావాల్సి ఉండగా వర్షం మొదలైంది. ప్రస్తుతం వాన ఆగిపోగా, తిరిగి జల్లులు పడకపోతే 8.10 తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియా 260 రన్స్కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 185 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Similar News
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
News November 27, 2025
విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.


