News March 20, 2025
ఏప్రిల్ తొలివారంలో ‘ది రాజాసాబ్’ టీజర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా, టీజర్తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ తొలివారంలోనే టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.
Similar News
News March 21, 2025
నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.
News March 21, 2025
కష్ట సమయాల్లో అండగా కోహ్లీ: సిరాజ్

ఆర్సీబీని వీడటం బాధగా ఉందని పేస్ బౌలర్ సిరాజ్ అన్నారు. తన కెరీర్లో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. 2018-19లో క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వెన్నంటి ఉన్నారన్నారు. ఆ తర్వాత తాను తిరిగి సత్తా చాటినట్లు తెలిపారు. గత ఏడాది వేలంలో సిరాజ్ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరఫున 87 మ్యాచుల్లో 83 వికెట్లు తీశారు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ సిరాజ్.
News March 21, 2025
అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్

అక్రమ వలసదారుల కోసం CBP హోమ్ యాప్ తీసుకొచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ యాప్ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్లవచ్చని తెలిపారు. అలా వెళ్లడం ద్వారా తరువాతి కాలంలో లీగల్గా అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా అక్రమంగా ఉండి ప్రభుత్వానికి పట్టుబడితే వారిని అమెరికా నుంచి బహిష్కరించడంతో పాటు దేశంలోకి మరోసారి ప్రవేశముండదని ట్రంప్ హెచ్చరించారు.