News October 28, 2025

వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

image

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.

Similar News

News February 13, 2026

వాలంటైన్స్ డే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు!

image

TG: వాలంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ డేటింగ్ ప్రొఫైళ్లు, గిఫ్ట్ ఆఫర్లు, పూల డెలివరీ, డిస్కౌంట్‌ల పేరిట లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాటిపై క్లిక్ చేస్తే నకిలీ పేమెంట్ వెబ్ సైట్లు, యాప్స్ డౌన్‌లోడ్ అయి డబ్బు మాయమవుతాయని తెలిపారు. అటు OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.