News April 25, 2024

మలయాళ చిత్రాల సక్సెస్‌కు కారణమిదే: ఫహాద్

image

ఈ ఏడాది మలయాళ సినిమాలు భారీ విజయాలు సాధించడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సక్సెస్‌కు కారణం భిన్నమైన కంటెంట్ అని చెప్పారు. కొత్త కథలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారన్నారు. ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఫహాద్ నటించిన ‘ఆవేశం’ మూవీ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆయన ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తున్నారు.

Similar News

News January 26, 2026

T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.

News January 26, 2026

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

image

AP: తిరుమల కొండపై రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుండగా చిరు జల్లులు, వెలుగుల మధ్య ఏడుకొండలవాడు అద్వితీయంగా కనువిందు చేశారు. భక్తులు స్వామిని స్మరిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

News January 26, 2026

రేపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన

image

దేశవ్యాప్తంగా రేపు నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారిక కార్మికులుగా గుర్తించడంతో పాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఆదాయ భద్రత లేకపోవడం, అకారణంగా ఐడీలు బ్లాక్ చేయడం, పారదర్శకత లేని రేటింగ్ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది.