News January 27, 2025
రికార్డు సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ

విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో నవ్వులతో పాటు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. విడుదలైన 13వ రోజు AP, TGలో ఈ సినిమా రూ.6.77 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి-2 13వ రోజు షేర్ను సంక్రాంతికి వస్తున్నాం క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ సినిమా రూ.276 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Similar News
News November 26, 2025
ఆనంద నిలయం విశేషాలివే..

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 26, 2025
రాజ్యాంగం@76 ఏళ్లు

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
News November 26, 2025
ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్ దీపిక గురించి తెలుసా?

తాజాగా అంధ మహిళలు టీ20 ప్రపంచకప్ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని సత్యసాయి జిల్లాకు చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. కర్ణాటకలో చదివిన ఆమె 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.


