News April 1, 2024
అత్యధిక డకౌట్ల రికార్డు సమం

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. IPLలో ఎక్కువసార్లు(17) డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ సరసన చేరారు. 15 డకౌట్లతో మ్యాక్స్‌వెల్, పియూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నారు.
Similar News
News February 2, 2026
పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.
News February 2, 2026
నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.
News February 2, 2026
ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్‌లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.


