News December 24, 2024

వీఆర్వోల నియామక ప్రక్రియ ప్రారంభం!

image

TG: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇతర శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తోంది. గూగుల్ ఫామ్స్‌లో ఈనెల 28లోగా వివరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 11వేల మంది అధికారులను నియమించనుండగా, ఇందులో సగం మందిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కొత్త పోస్టుల నియమ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News December 25, 2024

విలన్ పాత్రకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్?

image

కథానాయకులు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ కన్నడ నటుడు యశ్ విలన్ పాత్రకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ హిందీలో తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్ర చేయడానికి గాను యశ్‌ భారీగా డిమాండ్ చేశారని సమాచారం. పాత్రకు ఆయనే కరెక్ట్ అని భావించిన మేకర్స్, ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

News December 25, 2024

₹10కే టీ, ₹20కి సమోసా.. అది కూడా విమానాశ్రయంలో

image

అధిక ధరల కారణంగా విమానాశ్రయంలో ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ₹10కే టీ, వాట‌ర్ బాటిల్‌, ₹20కే కాఫీ, సమోసా లభించనున్నాయి. తక్కువ ధరలకే రీఫ్రెష్‌మెంట్స్ అందించే ‘ఉడాన్ యాత్రి కేఫే’ పైల‌ట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు మంగ‌ళ‌వారం కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో ప్రారంభించారు. ఆప్ ఎంపీ రాఘవ్ చ‌ద్దా ఈ అంశాన్ని పార్ల‌మెంటులో లేవ‌నెత్తగా, ప్ర‌భుత్వం కేఫే ఏర్పాటుకు ముందుకొచ్చింది.

News December 25, 2024

కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)

image

AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.