News March 10, 2025

జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు: అనగాని

image

AP: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.

Similar News

News November 26, 2025

బాహుబలిగా పల్నాడు జిల్లా..!

image

పల్నాడు జిల్లా బాహుబలిగా రూపాంతరం చెందింది. జిల్లాలో నాగార్జునసాగర్, ఎత్తిపోతల, పులిచింతల, అమరావతి, ధ్యాన బుద్ధ, కొండవీడు, కోటప్పకొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంగా ఉంది. నాపరాయి మైనింగ్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు జిల్లా మీదగా వెళ్తున్నాయి. హైదరాబాద్ చెన్నై కారిడార్, గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవే జిల్లా నుంచి వెళ్లనున్నాయి.

News November 26, 2025

కుకుంబర్ మొజాయిక్ వైరస్‌తో మిరప పంటకు ముప్పు

image

కుకుంబర్ మొజాయిక్ వైరస్ సోకిన మిరప మొక్కలు గిడసబారి కనిపిస్తాయి. ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోవడంతో పాటు ఆకులు ఆకారం మారిపోయి, కొనలు సాగి కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన మొక్కల్లో పూత, కాపు ఉండదు. ఈ వైరస్ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3ml లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల్లో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి.

News November 26, 2025

అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

image

TG: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్(D) వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. HYD జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్‌(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.