News November 14, 2024

ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి

image

రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.

Similar News

News November 14, 2025

ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

image

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్‌లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం.

News November 14, 2025

APPLY NOW: NIPHMలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (<>NIPHM<<>>) 3పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, టెన్త్, ITI/వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niphm.gov.in/

News November 14, 2025

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ

image

పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బిడ్డను కనే ప్రయత్నంలో ఎదురైన ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర కథ. బోల్డ్ పాయింట్‌ను డైరెక్టర్ సంజీవ్ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసేలా తీశారు. విక్రాంత్, చాందినీ చౌదరి పాత్రలు, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కామెడీ ప్లస్. కొన్ని సాగదీత సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, అక్కడక్కడా ఎమోషన్స్ తేలిపోవడం మూవీకి మైనస్ అయ్యాయి.
రేటింగ్: 2.5/5