News July 18, 2024

మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

image

AP: శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మొత్తం ఏడు అంశాల్లో ఇప్పటి వరకు నాలుగింటిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.

Similar News

News December 22, 2025

నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

image

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.

News December 22, 2025

డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (ఫొటోలో)
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక పౌరుడిని హతమార్చారు
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం

News December 22, 2025

రికార్డు సృష్టించిన స్మృతి

image

టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. మహిళల T20Iల్లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఏషియన్ ప్లేయర్‌గా నిలిచారు. 154 మ్యాచుల్లో 4,007 రన్స్ చేశారు. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 రన్స్‌తో తొలి స్థానంలో ఉన్నారు.