News September 6, 2024

నెల జీతం విరాళంగా ప్రకటించిన వైసీపీ ప్రజాప్రతినిధులు

image

AP: వరద బాధితులకు వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ చీఫ్ జగన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 5, 2026

హ్యాపీ హార్మోన్స్ కోసం ఇలా చేయాలి

image

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది.

News January 5, 2026

ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా.. జేఎన్‌యూ స్టడీ

image

ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను గుర్తించారు. యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ఈ సూపర్‌బగ్ ఉన్నట్టు జేఎన్‌యూ స్టడీలో వెల్లడైంది. దేశ రాజధానిలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాలు, హాస్పిటల్స్ పరిసరాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. న్యుమోనియా, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లకు ఈ బగ్ కారణమవుతుందని తెలిపింది. WHO పరిమితికి మించి గాలిలో 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా వ్యాపించినట్టు తెలిపింది.

News January 5, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

image

బంగ్లాదేశ్‌లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్‌ను జాతీయ పార్టీ BNP, జమాత్‌తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.