News November 1, 2024
రిపబ్లికన్ల ఫారిన్ పాలసీ డిఫరెంట్

అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయవచ్చని భావిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన పర్యావరణ చట్టాలను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీకరించేలా కీవ్‌పై ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 17, 2026
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధం

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన ఆదివారం నిర్వహించేందుకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. SGS స్కూల్, గీతం స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఏ బిర్లా స్కూల్లో పరీక్షలు జరగనున్నాయి. 1569 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు, 9 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు.
News January 17, 2026
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్..13 మందికి భారీ జరిమానా

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ 13 మందికి రూ.1,32,000ల జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరుపరచామని.. ఆయన ఈ మేరకు తీర్పు ఇచ్చారన్నారు.
News January 17, 2026
శుభ సమయం (17-1-2026) శనివారం

➤ తిథి: బహుళ చతుర్దశి రా.11.53 వరకు
➤ నక్షత్రం: మూల ఉ.8.29
➤ శుభ సమయాలు: ఉ.10.16-1.03, మ.1.58-2.53, సా.4.44-సా.5.39 వరకు
➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
➤ యమగండం: మ.1.30-3.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6.35-8.04 వరకు
➤ వర్జ్యం: ఉ.6.43-8.29, సా.6.54-8.39 వరకు


