News October 22, 2024

దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆదాయం రూ.9.26 కోట్లు

image

AP: దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భారీ ఆదాయం లభించింది. ఆలయంలోని మహా మండపంలోని మూడు విడతల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తంగా రూ.9,26,97047 నగదు లభించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండి లభ్యమైందన్నారు.

Similar News

News February 26, 2026

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

image

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.

News February 26, 2026

తీర్థం ఎందుకు తీసుకోవాలి?

image

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.

News February 26, 2026

APPLY NOW: JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER<<>>)లో 26 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. MBBS అర్హత గల అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఫిబ్రవరి 28న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in