News April 5, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,327 మంది దర్శించుకోగా, 26,354 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News November 27, 2025

WPL మెగా వేలంలో అమ్ముడుపోని హీలీ.. దీప్తికి రూ.3.2 కోట్లు

image

WPL మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీకి షాక్ తగిలింది. వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో Unsoldగా మిగిలారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిని రూ.3.2 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.

News November 27, 2025

RED ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

image

AP: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని APSDMA వెల్లడించింది. దీనికి ‘దిట్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం CTR, TPT, NLR, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News November 27, 2025

శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

image

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్‌లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.