News January 6, 2025

జవాన్ల త్యాగం వృథాగా పోదు: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మందుపాతర పేలి <<15079768>>జవాన్లు మరణించిన<<>> ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగం వృథాగా పోదని, వారి లోటును మాటల్లో వర్ణించలేమన్నారు. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఉద్ఘాటించారు. జవాన్లపై దాడిని పిరికిపంద చర్యగా CG సీఎం విష్ణుదేవ్ వర్ణించారు.

Similar News

News October 28, 2025

మూవీ అప్డేట్స్

image

* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డెకాయిట్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల
* నవీన్ పొలిశెట్టి, రవితేజ కాంబినేషన్లో సినిమా.. ప్రసన్న కుమార్ కథకు Ok చెప్పిన హీరోలు!
* తిరువీర్ హీరోగా తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ రిలీజ్.. NOV 7న మూవీ రిలీజ్
* ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవంత్‌కు పెళ్లి కానుకగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత మాగేశ్ రాజ్

News October 28, 2025

వాస్తురీత్యా ఇంటి గదులు ఎలా ఉండాలి?

image

ఇల్లు, గదుల నిర్మాణం దిక్కులకు అనుగుణంగా, ప్రాణశక్తి, ఉల్లాసాన్ని కలిగించేలా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘గదుల నిర్మాణం 4 మూలలతో ఉంటేనే గాలి, వెలుతురు సమతుల్యంగా ఉంటాయి. ఇంట్లోని గదులు ఏ మూల పెరిగినా, తగ్గినా వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. వృత్తాకార నిర్మాణాలు అతిథి గృహాలు, ఫంక్షన్ హాళ్లకే అనుకూలం. వాస్తు నియమాలు పాటిస్తే జీవితం హాయిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 28, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.