News April 21, 2025
‘శాలరీ’ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది!

భారత్‌లో దశాబ్దాలుగా మధ్య తరగతివారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘ఇండియా నూతన ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తోంది. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రానున్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. వందలాది మంది చేసే పనిని AI క్షణాల్లో చేసేస్తోంది. ఎవరికీ గ్యారంటీ లేదు’ అని వివరించారు.
Similar News
News August 6, 2025
కోర్టుకు ఏం చెప్పాలనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు!

TG: సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నెలన్నర క్రితం హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం పంపిన BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఎటూ తేల్చలేదు. రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న సర్కారు హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా CS రామకృష్ణారావు న్యాయనిపుణులతో భేటీ అయి కోర్టును మరింత సమయం కోరే అంశాలపై చర్చించారు.
News August 6, 2025
ఖాతాదారులకు HDFC బ్యాంక్ హెచ్చరికలు

APK ఫైల్ స్కామ్‌పై HDFC బ్యాంక్ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ‘స్కామర్లు మీకు బ్యాంకు సిబ్బందిలా APK ఫైల్స్ పంపుతారు. అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాలవుతుంది. మీ కాల్స్, డేటా వారికి చేరుతుంది. రీ-కేవైసీ, పెండింగ్ చలాన్లు, ట్యాక్స్ రిటర్న్స్ అని వచ్చే లింక్స్ క్లిక్ చేయకండి. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి. మోసపూరిత లింక్స్, మెసేజులు వస్తే రిపోర్ట్ చేయండి’ అని సూచించింది.
News August 6, 2025
సీజ్‌ఫైర్ ఉల్లంఘన రిపోర్ట్స్‌పై స్పందించిన ఆర్మీ

J&Kలోని పూంఛ్ సెక్టార్‌లో పాక్ సీజ్‌ఫైర్ ఉల్లంఘించిందంటూ పలు రిపోర్టులు, దాదాపు అన్ని మీడియా ఛానల్స్‌లో వచ్చిన వార్తలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. LoC వెంట ఎలాంటి సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, పాక్ కాల్పులకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చింది. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పాక్ సీజ్‌ఫైర్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆర్మీ వర్గాలు చెప్పినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి.