News July 13, 2024
అదే దూకుడు.. అదే బాదుడు!

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైరైనా కంగారూ జట్టుపై చితక్కొట్టడం మాత్రం మర్చిపోలేదు. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో నిన్నటి సెమీఫైనల్లో యువీ 28బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశారు. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో గెలిచింది. యువీ గతంలోనూ AUSను ఇలాగే చిత్తు చేశారు. 2000 CT క్వార్టర్ ఫైనల్, 2007WC సెమీస్, 2011WC క్వార్టర్ ఫైనల్స్‌లో POTM గెలిచారు.
Similar News
News October 31, 2025
ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.
News October 31, 2025
2,790 మంది ఇండియన్స్‌ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.


