News October 21, 2024

నాడు టాటా నాటిన మొక్క నేడు వృక్షమైంది

image

దివంగత రతన్ టాటా 23 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో నాటిన ఓ మొక్క నేడు వృక్షంగా ఎదిగింది. 2001, అక్టోబరు 15న టాటా ఇన్ఫీ ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ సమయంలో టబీబుయా రోజియా జాతికి చెందిన మొక్కను అక్కడ నాటారు. నేడు అది పది మందికి నీడనిస్తూ ఆయన జీవితాన్ని గుర్తుచేస్తోంది. ఇటీవలే ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఆ చెట్టు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News

News October 21, 2024

తుఫాను ముప్పు.. భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News October 21, 2024

క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం రంగు మారుతుందా..?

image

క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్‌లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్‌లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.

News October 21, 2024

ట్రంప్.. మీరు ఫిట్‌గా ఉన్నారా?: కమలా హారిస్

image

అత్యంత కష్టమైన అమెరికా అధ్యక్ష పదవిలో పనిచేసేంత ఫిట్‌గా ట్రంప్ ఉన్నారా అంటూ కమలా హారిస్ తాజాగా ప్రశ్నించారు. అలసిపోవడం వల్ల పలు ఇంటర్వ్యూలను ట్రంప్ రద్దు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ప్రచారంలోనే అలసిపోయే మీరు అధ్యక్ష పదవికి అర్హులేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి’ అని విమర్శించారు. మరోవైపు.. కమలకు కనీసం కుందేలుకున్న ఎనర్జీ కూడా లేదంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.