News August 21, 2024

అప్పటి SC రిజర్వేషన్ల కోటా ఇలా..!

image

1996లో సీఎం చంద్రబాబు ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్ ఏర్పాటు చేశారు. ఎస్సీలకు అందుతున్న 15% రిజర్వేషన్లను A, B, C, Dగా వర్గీకరిస్తూ జీవో ఇచ్చారు. A గ్రూపులో రెల్లి సహా 12 కులాలను కలుపుతూ 1%, మాదిగ, దాని 18 ఉపకులాలను Bలో చేర్చి 7%, C గ్రూపులోని మాల, ఉపకులాలకు 6%, D గ్రూపులోని ఆంధ్రులు, మిగతా 4 కులాలకు 1% కోటా అమలు చేశారు. దీనిపై కోర్టులో అభ్యంతరం తెలపడంతో ఆగిపోయింది.

Similar News

News February 12, 2025

అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?

image

ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్‌కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్‌లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.

News February 12, 2025

వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

image

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

News February 12, 2025

సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి

image

ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.

error: Content is protected !!