News August 29, 2025
ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్ శ్రీహరి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22-28 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-సా.5.30 గంటల వరకు ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <
Similar News
News August 29, 2025
RED ALERT: అత్యంత భారీ వర్షాలు

TG: ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, KNRలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(ఆరెంజ్ అలర్ట్) కురుస్తాయని పేర్కొంది. కొత్తగూడెం, HNK, జనగాం, BHPL, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, WGLలో భారీ వర్షాలు(ఎల్లో అలర్ట్), ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
News August 29, 2025
నేడు 6 జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, ఏలూరు, ప.గో, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడులో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
News August 29, 2025
పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు. పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. 5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే, ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.