News October 4, 2024
ఆ పథకాన్ని తొలగించట్లేదు: ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం

AP: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని(గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.
Similar News
News December 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 13న నవోద ప్రవేశ పరీక్ష

2026-27 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లాలని సూచించారు.
News December 12, 2025
AAIలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News December 12, 2025
‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.


