News February 5, 2025
రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 5, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.
News November 5, 2025
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>
News November 5, 2025
పంజాబ్& సింధ్ బ్యాంక్‌లో 30 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్(<


