News April 14, 2025

నేను చేసిన స్కోరుకు విలువే లేదు: కరుణ్ నాయర్

image

IPL: ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తాను చేసిన స్కోరుకు విలువే లేదన్నారు. తనకు జట్టు విజయమే ముఖ్యమని.. ఓడిపోయిన మ్యాచ్‌లో ఎంత స్కోర్ చేసినా లాభం లేదన్నారు. ముంబైపై కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89(12 ఫోర్లు, 5 సిక్సర్లు) స్కోర్ చేశారు. తన పవర్ హిట్టింగ్‌తో బుమ్రాను సైతం వణికించారు. కరుణ్ నాయర్, పోరెల్(33) మినహా ఢిల్లీ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.

Similar News

News April 1, 2026

మెదక్: తప్పుడు వార్త రాసిన రిపోర్టర్లకు నోటీసులు

image

రామాయంపేట మండలం తొనిగండ్ల శివారులోని ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అక్రమంగా ఇతరులకు విక్రయించారని, బదిలీ చేశారని తహశీల్దార్‌పై తప్పుడు వార్త రాసిన ఇద్దరు రిపోర్టర్లకు రామాయంపేట తహశీల్దార్ రజనీకుమారి నోటీసులు జారీ చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 94/1లో ప్రభుత్వ భూమి విక్రయించినట్లు రాసిన వార్తపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 1, 2026

మహిళల దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’

image

దంపతుల మధ్య లైంగిక స్పందనలు వేర్వేరుగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పురుషుడు త్వరగా ఉద్రేకం పొందితే.. స్త్రీ సిద్ధమవడానికి సమయం, స్పర్శ, సురక్షిత భావన అవసరమంటున్నారు. ‘బలవంతంతో కూడిన సెక్స్‌లో ప్రేమ ఉండదు. అది విడాకులకు దారి తీయొచ్చు. పోర్నోగ్రఫీకి దూరంగా ఉండి భాగస్వామి ఇష్టాలను గౌరవిస్తూ ఇద్దరూ ఆనందించడమే వివాహ బంధానికి పరమార్థం. స్త్రీ మనసు గెలవడమే అసలైన మగతనం’అని పేర్కొంటున్నారు.

News April 1, 2026

త్వరలో ఆ రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

image

TG: రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు త్వరలో రైతు‌భరోసా సాయం అందనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. కొత్తగా 62 వేల మంది అప్లై చేసుకోగా, అర్హులుగా గుర్తించిన రైతులకు ఈ నెల 15-20వ తేదీల మధ్య నిధులు జమ చేస్తారని తెలుస్తోంది. గత నెల 23వ తేదీ ఎకరాకు రూ.6వేలు చొప్పున తొలి విడత సాయం రైతుల అకౌంట్లలో జమ చేశారు.