News August 16, 2025

AIతోనే స్క్రిప్ట్, డబ్బింగ్, డీఏజింగ్ చేసేశారు!

image

సినీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. సైయారా, కూలీ, వార్-2 సినిమాల్లో AI కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైయారా క్లైమాక్స్ స్క్రిప్ట్‌ను AI జనరేట్ చేయగా, వార్-2 డబ్బింగ్‌ & కూలీలో రజినీకాంత్ డీఏజింగ్‌ను ఏఐ ద్వారా చేశారని టాక్. బెంగళూరులోని ఓ AI స్టార్టప్ విజువల్ డబ్ అనే టూల్‌ను వాడి ‘వార్-2’ను తెలుగులోకి డబ్ చేశారట. ఇది ఆడియోకు సరిపోయేలా నటుల లిప్ సింక్‌ను మారుస్తుంది.

Similar News

News August 17, 2025

ఫ్రీ బస్ స్కీమ్.. ఆధార్ జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి?

image

AP: ‘స్త్రీ శక్తి’ స్కీమ్ అమలులో భాగంగా RTC బస్సుల్లో ఆధార్ జిరాక్స్, సెల్‌ఫోన్‌లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పథకం అమలు తీరుపై CM చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. గడచిన 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి నుంచి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News August 16, 2025

టాలీవుడ్ పంచాయితీ: మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెట్టేనా?

image

సినీ కార్మికుల వేతన పెంపు పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సమస్యలపై చర్చించేందుకు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు రేపు చిరు ఇంట్లో సమావేశం కానున్నారు. ఇరువర్గాల మధ్య చిరు సయోధ్య కుదుర్చుతారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు పట్టుబడుతుండగా షరతులతో కూడిన పెంపునకు నిర్మాతలు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

News August 16, 2025

INDIA MAP: రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలిలా

image

కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్, రవాణా ఖర్చులు, డీలర్ కమీషన్‌తో పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వివరాలు తెలిపే మ్యాప్ వైరలవుతోంది. ఇందులో అత్యధికంగా APలో ₹109.5, TGలో ₹107.46 ఉన్నాయి. అలాగే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ₹82.46గా ఉంది. గతంలో BJP పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం వల్ల అక్కడి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.