News July 2, 2024
ఈ నెలలో ‘దేవర’ నుంచి రెండో సాంగ్?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నెలలోనే మూవీ నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో సాగే ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
News December 5, 2025
రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలం: నారాయణ

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్‌కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.
News December 5, 2025
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్‌ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


