News May 21, 2024
‘పుష్ప-2’ నుంచి రేపు రెండో సాంగ్ రిలీజ్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప-2’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11.07 గంటలకు రెండో సాంగ్ రానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 3, 2025
ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు కానీ..: ఉజ్మా

పాకిస్థాన్ మాజీ ప్రధాని <<18450195>>ఇమ్రాన్<<>> ఖాన్ మరణించారనే ఊహాగానాలకు ఆయన సోదరి ఉజ్మా తెరదించారు. ఆయన అదియాలా జైలులో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అయితే ఐసోలేట్ చేయడంపై కోపంగా ఉన్నారని వెల్లడించారు. ఎవరితోనూ ఆయనను కలవనివ్వట్లేదని, ఇది మానసికంగా టార్చర్ చేయడమేనని పేర్కొన్నారు. కొద్ది సమయం సోదరుడితో జరిగిన సమావేశానికి మొబైల్ కూడా అనుమతించలేదని తెలిపారు.
News December 3, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 3, 2025
విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.


