News September 8, 2024
థర్డ్ అంపైర్ లేకుండానే సిరీస్ ఆడేశారు

థర్డ్ అంపైర్ లేకుండానే ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ T20 సిరీస్ ముగిసింది. థర్డ్ అంపైర్ లేకపోవడంతో DRS, రనౌట్, స్టంపౌట్‌ను ఫీల్డ్ అంపైర్లే ప్రకటించారు. ఈ విషయంలో ఆసీస్ బ్యాటర్ మెక్‌గుర్క్‌కు కలిసొచ్చింది. రెండో T20లో అతడు స్టంపౌటైనా ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. రీప్లేలో ఔటైనట్లు స్పష్టంగా కనిపించింది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఆసీస్ ఆడుతున్నా థర్డ్ అంపైర్ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 3, 2025
ఉపగ్రహాలతో గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించొచ్చు: మస్క్

వాతావరణ మార్పులపై ఆందోళన పెరుగుతున్న వేళ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏఐతో నడిచే భారీ ఉపగ్రహాల సముదాయంతో గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భూమిని చేరే సౌర శక్తి మొత్తంలో చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. సహజ పరిణామాన్ని నిరోధిస్తే ముప్పు తప్పదని కొందరు ఆయనకు కౌంటర్ వేస్తున్నారు.
News November 3, 2025
కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.


