News October 10, 2025

ఇప్పటికీ జీవించి ఉన్న సప్త చిరంజీవులు

image

1. శివానుగ్రహంతో అమరుడైన ద్రోణుని పుత్రుడు ‘అశ్వత్థామ’.
2. దయగల అసుర రాజు ‘మహా బలి చక్రవర్తి’.
3. మహాభారత రచయిత ‘వేద వ్యాసుడు’.
4. రామ భక్తుడైన ‘హనుమంతుడు’.
5. లంక రాజు, ధర్మ పరిరక్షకుడిగా భావించే ‘విభీషణుడు’.
6. మహాభారతంలో వీరుడు ‘కృపాచార్యుడు’.
7. దశావతారాల్లో ఒకరైన ‘పరశురాముడు’

Similar News

News October 10, 2025

కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. టాప్ కంటెండర్స్ వీరే

image

నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ 2.30PMకు పీస్ ప్రైజ్‌ను ప్రకటించనుంది. ఈ అవార్డు కోసం ట్రంప్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు రేసులో ఉన్నారు. 244 వ్యక్తులు, 94 సంస్థలు కలిపి మొత్తం 338 నామినేషన్స్ వచ్చాయి. రష్యా ప్రతిపక్ష నేత భార్య యూలియా, క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సహా UN ఏజెన్సీస్ వంటి పలు సంస్థలు పోటీపడుతున్నాయి.

News October 10, 2025

రూ.509.25 కోట్లు రాబట్టిన ‘కాంతార చాప్టర్-1’

image

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 509.25 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరగొచ్చని సినీవర్గాలు తెలిపాయి.

News October 10, 2025

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్!

image

తెలంగాణలో వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో 45వేల మంది టీచర్లు టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ ప్రకటన రావొచ్చు.