News October 13, 2025
సంసార సాగరాన్ని దాటించే శివ లింగార్చన

శివుని గురించి శ్రవణం, కీర్తన, మననం చేయడం గొప్ప సాధన. ఈ సాధన ఆచరించలేని సామాన్యులు నిత్యం శివలింగార్చన చేస్తే చాలు. భయంకరమైన సంసార సముద్రాన్ని అతి సులభంగా దాటివేస్తారు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన ఆ మహాదేవుడికి కావలసింది మనోనైర్మల్యం, దృఢమైన భక్తి మాత్రమే. ఈ సత్యాన్ని శివమహాపురాణంలో సూత మహాముని మునులకు తెలియజేశారు. నిష్కల్మషమైన భక్తే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఓం నమః శివాయ! <<-se>>#SIVOHAM<<>>
Similar News
News October 13, 2025
15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
News October 13, 2025
నేడు, రేపు భారీ వర్షాలు

AP: మే నెల చివర్లో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ట్రాల నుంచి నిష్క్రమిస్తున్నాయి. 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయే ఆస్కారం ఉండగా.. 3, 4 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ప్రకాశం, ఏలూరు, ప.గో. తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
News October 13, 2025
ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

వరిని ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట వస్తుంది. అయితే చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ ఆరుసార్లు కోతకు వచ్చే వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. దీనికి ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అని పేరు పెట్టింది. దీన్ని ఓసారి నాటితే మూడేళ్లలో వరుసగా 6 సీజన్లపాటు దిగుబడిని తీసుకోవచ్చు. దీన్ని 17 దేశాలు సహా తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.