News July 6, 2024
‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ కంప్లీట్

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని మూవీ యూనిట్ వెల్లడించింది. కావ్యా థాపర్, సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ-రామ్ కాంబోలో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.
News November 20, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డు
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


