News September 3, 2025

ట్రాఫిక్ సమస్యను తీర్చిన ‘సింగపూర్ మోడల్’!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. 1975లో ఇలాంటి సమస్యే సింగపూర్‌లో ఎదురవగా వినూత్న ఆలోచనతో పరిష్కరించారు. నగరంలోని రద్దీ ఉండే ప్రాంతాలను ‘నియంత్రిత మండలం’గా గుర్తించి, ఇందులో ప్రవేశానికి ప్రత్యేక లైసెన్స్, నెలవారీ రుసుము పెట్టారు. సింగిల్‌గా కాకుండా కారులో నలుగురు ఉంటే ఆ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గి ట్రాఫిక్ సజావుగా సాగింది.

Similar News

News September 5, 2025

భార్యకు అధిక ఆదాయముంటే భరణం అక్కర్లేదు: మద్రాస్ HC

image

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. భార్యకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆమెకు అధికంగా ఆదాయం, ఆస్తులు ఉన్నాయని, భరణం ఇవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది.

News September 5, 2025

అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్

image

అనుష్క ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఘాటీ’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. US, UK ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అనుష్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఊహించే కథ, బోర్ కొట్టే సీన్స్ ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
*మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.

News September 5, 2025

రేపు KCRతో హరీశ్ భేటీ!

image

TG: BRS ముఖ్య నేత హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అధినేత KCRతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో చర్చించాక కవిత ఆరోపణలపై స్పందించే ఛాన్స్ ఉంది. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్‌కు సిద్ధమయ్యారు. కాగా కాళేశ్వరంలో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే.