News April 7, 2024
2014కు ముందు ఉన్న పరిస్థితే వస్తుంది: జగదీశ్ రెడ్డి

TG: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి నిర్మించిన వాటిని వంద రోజుల్లోనే నాశనం చేశారని అన్నారు. కొత్తగా మారుస్తారనుకుంటే.. 2014కు ముందు ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావుల పరిస్థితులే వస్తాయన్నారు.
Similar News
News February 17, 2026
పాలపళ్లను శుభ్రం చేస్తున్నారా?

పాలపళ్లు ఊడిపోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ వాటిపై శ్రద్ధ చూపరు. కానీ ఇవి నోటి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపించడంతో పాటు శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి. తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బట్టతో/మెత్తటి బ్రష్‌తో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
ఒత్తిడే అసలు శత్రువు!

మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల BP, హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’అని సూచిస్తున్నారు.
News February 17, 2026
మహిళలకు గుడ్‌న్యూస్.. రెండు కొత్త పథకాలు

AP: మహిళా దినోత్సవం(మార్చి 8) రోజున డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. ‘కళ్యాణ లక్ష్మి’ కింద పిల్లల వివాహాలకు ₹10వేల నుంచి ₹లక్ష వరకు రుణం ఇస్తుంది. 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ‘విద్యాలక్ష్మి’లో పిల్లల చదువుల కోసం ₹10,000-₹లక్ష రుణసాయం అందిస్తుంది. కనీసం 6 నెలలపాటు సభ్యత్వం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.


