News February 3, 2025
నా కెరీర్లో కొట్టిన సిక్సర్లు ఒక్క ఇన్నింగ్సులోనే బ్రేక్: కుక్
భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. తన టెస్టు కెరీర్ మొత్తంలో కొట్టిన సిక్సర్లను అభిషేక్ రెండు గంటల్లోనే బ్రేక్ చేశాడని అన్నారు. కుక్ 161 టెస్టుల్లో 11 సిక్సర్లు బాదగా 92 వన్డేల్లో 10 సిక్సర్లు బాదారు. నిన్నటి మ్యాచులో అభిషేక్ 13 సిక్సర్లతో 135 పరుగులు బాదారు. దీంతో భారత తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గానూ నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్
లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
News February 3, 2025
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
News February 3, 2025
సోషల్ మీడియాలో ఏపీ, తెలంగాణ ఫుడ్ వార్
సోషల్ మీడియాలో అభిమాన తారల గురించి వార్స్ చాలానే చూస్తున్నాం. తాజాగా Xలో కొందరు ఫుడ్ వార్కు తెరలేపారు. ఆంధ్ర, తెలంగాణ ఫుడ్లలో ఏది గొప్ప అంటూ చర్చ ప్రారంభించారు. కొందరు తమ ఫుడ్ గొప్ప అంటే తమ ఫుడ్ గొప్ప అని పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలపై కాకుండా ఏదైనా సమాజానికి మేలు చేసే అంశాలపై చర్చించాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.