News March 26, 2025
మల్లెలతీర్థం వల్లే SLBC ప్రమాదం!

TG: SLBC టన్నెల్ ప్రమాదానికి మల్లెలతీర్థం జలపాతమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆ జలపాతం నీరే ఊటనీరుగా మారి సొరంగం పైకప్పును కూల్చేసినట్లు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచేసినట్లుగానే ఈ ప్రాజెక్టును మల్లెలతీర్థం ముంచేసింది. టన్నెల్‌లోకి నిమిషానికి 3 వేల లీటర్ల ఊట రావడానికి కారణం ఇదే. ఇక్కడికి వచ్చే సీఫేజీ శ్రీశైలం రిజర్వాయర్‌ది కాదని వాటర్‌ఫాల్ నుంచి వస్తోందని నిర్ధారించారు.
Similar News
News March 26, 2025
ఎంపీ మిథున్‌రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు

AP: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ఏప్రిల్ 3 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అయితే ఎంపీకి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.
News March 26, 2025
‘ఆన్‌లైన్ బెట్టింగ్’పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు: కేంద్రమంత్రి

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అంశాలు రాష్ట్ర పరిధిలోనివని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. వీటిపై ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పుకుంటోందా? అని డీఎంకే ఎంపీ దయానిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది రాష్ట్రాల పరిధిలోనిది అయినా ఫిర్యాదుల ఆధారంగా 1,410 గేమింగ్ సైట్లను నిషేధించామని చెప్పారు.
News March 26, 2025
అధిక వడ్డీనిచ్చే FDలు.. 5 రోజులే గడువు

✒ కొన్ని బ్యాంకులు అధిక వడ్డీతో FDలను అందిస్తున్నాయి. వీటి గడువు ఈ నెల 31తో ముగియనుంది.
✒ అమృత్ వృష్టి(SBI)- సీనియర్ సిటిజన్లకు 7.75%, ఇతరులకు 7.25%
✒ అమృత కలశ్(SBI)- వృద్ధులకు 7.6%, ఇతరులకు 7.1%
✒ ఉత్సవ్(IDB)-వృద్ధులకు 7.09%, ఇతరులకు 7.4%
✒ ఇవి కాకుండా ఇండియన్ IND సూపర్ 300, 400 పేరుతో 7.05%-8.05% మధ్య, HDFC 7.35%, 7.85%తో FDలను అందిస్తున్నాయి.