News July 31, 2024
పూజలు చేసిన పామే కాటేసింది!
అలుగుల గంగవ్వ(65)కు తన ఇంటి ఆవరణలోని పుట్టలో విషపూరిత సర్పం ఉందని తెలుసు. అయినా సరే చాలా ఏళ్లుగా దాన్ని దైవంలా పూజిస్తోందావిడ. కానీ కాలనాగుకు కనికరం ఏముంటుంది? మంగళవారం ఆమె ఇల్లు అలుకుతున్న సమయంలో కాటేసింది. స్థానికులు గుర్తించి చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గంగవ్వ కన్నుమూసింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Similar News
News February 2, 2025
నేటి ముఖ్యాంశాలు
* రూ.50.65లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* ఇది 140కోట్ల మంది ఆశల బడ్జెట్: PM మోదీ
* రూ.12 లక్షల వరకు నో IT
* బడ్జెట్ను స్వాగతించిన CBN, పవన్
* APలో మరో 7 ఎయిర్పోర్టులు: రామ్మోహన్
* AP పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా ABV
* లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్న సచిన్
* TGకు బడ్జెట్లో మొండిచెయ్యి: హరీశ్ రావు
* 5న TG క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
News February 2, 2025
షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?
AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్లోని లోటస్పాండ్లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
News February 2, 2025
ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!
ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.