News February 11, 2025
ఆప్ MLA అరెస్టుకు రంగం సిద్ధం!

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని FIR నమోదైంది. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీస్ టీమ్‌ను అడ్డుకున్నారని, పబ్లిక్ సర్వెంట్స్‌పై దాడిచేశారని అందులో ప్రస్తావించారు. ఆమ్ఆద్మీ పార్టీలో అమనతుల్లా ఖాన్ కీలక నేత. CAA, NRC అల్లర్లు జరిగిన షాహీన్‌బాగ్ ఆయన నియోజకవర్గంలోనే ఉంది.
Similar News
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.